Watch Live T.Vs...









తెలుగు న్యూస్...

బిపాసను బండబూతులు తిట్టిన హోటల్ యజమాని

తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి బిపాసా బసు రానందుకు ఢిల్లీలోని రమదా హోటల్ యజమాని అశోక్ బండబూతులు తిట్టినట్లు బిపాస సన్నిహితులు చెప్పుకొచ్చారు. రోజుకు 25 నిమిషాలు కష్టపడితే చాలు... శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చనీ, దానికోసం అనుసరించవలసిన ఆరోగ్య సూత్రాలతో కూడిన డీవీడీని విడుదల చేసేందుకు బిపాసా ఢిల్లీ వెళ్లింది.

ఈ డీవీడీ విడుదల కార్యక్రమాన్ని రమదా హోటల్ యజమాని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంతోపాటు తన బర్త్ డే పార్టీకి కూడా బిపాసా బసును ఆహ్వానించాడు. కానీ పుట్టినరోజు పార్టీకి రానని బిపాసా మొండికేసి తన హోటల్ గదిలోనే ముణగదీసుకుని పడుకుండిపోయింది. ఈ సంగతి తెలుసుకున్న హోటల్ యజమాని బిపాసాపై కారాలు మిరియాలు నూరుతూ ఆమె గది వద్దకు వెళ్లాడు.

పార్టీకి రమ్మని గట్టిగా అరిచాడు. అతను అలా అరిచి గీ పెట్టినా బిపాసా మాత్రం కాలు తీసి బయట పెట్టలేదు. బిపాసా పర్సనల్ అసిస్టెంట్... "మేడమ్ నిద్రపోతున్నారు. ఆమెను డిస్టర్బ్ చేయడం ఎట్టి పరిస్థితిలో కుదరద"ని హోటల్ యజమాని అశోక్‌కు చెప్పాడు. దీంతో అతను తన నోటికి వచ్చినట్లు బిపాసాబసును అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. తన హోటల్ నుంచి తక్షణమే ఖాళీ చేయాలని కోరడంతో బిపాసా తెల్లవారు ఝామున మెల్లగా అక్కడ నుంచి జారుకుంది.

   Newer Post    Older Post  







Home | Galleries | Music | Videos | Telugu Version | Live Movies | Links | Contact Us
Copyright © 2009. All rights reserved. http://www.andhramasala.net