Watch Live T.Vs...









తెలుగు న్యూస్...

ఉపిరి పీల్చుకున్ననిర్మాత సింగనమల రమేష్

తాను తల పట్టిన యజ్ఞం రెండున్నరేళ్లకు దాదాపు పూర్తి కావస్తుండటంతో ఆ చిత్ర నిర్మాత శింగనమల రమేష్ కాస్త ఉపిరి పిల్చుకున్నట్లు కనిపిస్తోంది. రెండున్నరేళ్ళ కిందట ప్రిన్స్ మహేష్ హీరోగా త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం దాదాపు 80 శాతం పూర్తి కావడం తో మిగిలిన ఇరవై శాతం షూటింగ్ కు కూడా పూర్తి చేసి మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి వేసవి లో విడుదల చేయడానికి ఇప్పటి నుంచే ప్రయ త్నా లు పనిచేయనున్నట్లు తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా ఇటివల రంగా రెడ్డి జిల్లా వికారాబాద్ అటవీ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాన్ని తలపించేలా వేసిన భారి శ్ర్ట్టింగ్ ను తెలంగాణా వాదులు పూర్తిగా తగుల పెట్టారు. దాంతో షూటింగ్ ని కాస్త రాష్ట్రం అవతల చేయాల్సి వచ్చింది.


ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. మొదట వరుడు అన్న టైటిల్ అనుకున్న దాన్ని అల్లు అర్జున్ హీరోగా నిర్మిస్తున్న చిత్ర నిర్మాత కోరడం ఇచ్చేశారు. యాక్షన్ తో పాటు కామెడి సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయని వినికిడి.'అతను' తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది.'అతిధి' చిత్రం తరువాత ఇప్పటిదాకా మహేష్ చిత్రం ఏది విడుదల కాలేదు. రెండున్నరేళ్ళ తరువాత మహేష్ నటిస్తున్న చిత్రం పై అయన అభి మానుల్లో ఇప్పటికే భారి అంచనాలు నెలకొన్నాయి. వేసవి సీజన్లో మహేష్ చిత్రం ఎంతటి సంచ లనాన్ని సృష్టిస్తుందో చూడాలి మరి!

   Newer Post    Older Post  







Home | Galleries | Music | Videos | Telugu Version | Live Movies | Links | Contact Us
Copyright © 2009. All rights reserved. http://www.andhramasala.net